శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు
General

శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు

Sunday, 13 September 202630 views

భక్తుల సౌకర్యార్థం కొరకు కొండపైకి ప్రత్యేక బస్సులు 

ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా పూర్తిగా ఆన్లైన్ సర్వీస్ 

నల్లమల దేవాలయ పర్యాటక ప్రాంతం అభివృద్ధికి అందరూ సహకరించాలి

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్ 13

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో ఉమామహేశ్వర దేవాలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని దేవాలయాలపై అనవసర అసత్య ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయ క్షేత్రంలో ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులు దాశరథి పవన్, గండికోట దశరథo, మతృ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల రాజగోపాల్, ఎళ్లి కంటి శ్రీనివాసులు ఆదివారం విలేకరులు సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కొంతమంది వ్యక్తులు నాయకులుగా చలామణి అవుతూ, శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అనవసరమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు  మండిపడ్డారు.అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో, దేవస్థానం చైర్మన్ బిరం మాధవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం అభివృద్ధికి సుమారు రూ.4 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ముఖ్యంగా కొండపై ఉన్న దేవాలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిపై కూడా కొంతమంది కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు

Share this article

Related Articles