పర్యావరణ పరిరక్షణే లక్ష్యం మట్టి వినాయకులను  పంపిణీ
General

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం మట్టి వినాయకులను  పంపిణీ

Sunday, 13 September 20262 views

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్ 13

అచ్చంపేట పట్టణంలో బీబీసీ  వారి కళాంజలి ఫ్యాషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ  ఉపాధ్యక్షులు, డీసీసీ  అధ్యక్షులు  అచ్చంపేట ఎమ్మెల్యే  డాక్టర్ వంశీకృష్ణ వారి సతీమణి సీబీఎం  ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ అనురాధ పాల్గొని కార్యక్రమాన్ని ప్రోత్సహించి పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  దంపతులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని సూచించారు. భక్తి, సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయకుల పంపిణీ చేపట్టిన నిర్వాహకులను ఎమ్మెల్యే దంపతులు అభినందించారు. "భక్తితో పూజిద్దాం.. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం" అనే సందేశంతో ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం కలిగించిందనీ తెలిపారు.

Share this article

Related Articles