download
దేశవ్యాప్త పాదయాత్రకు ఘన వీడ్కోలు
General

దేశవ్యాప్త పాదయాత్రకు ఘన వీడ్కోలు

Monday, 7 September 20267 views

దేశవ్యాప్త పాదయాత్రకు ఘన వీడ్కోలు

నేటి కేసరి మహబూబ్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 07 ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ప్రతిష్టాత్మక దేశవ్యాప్త యాత్ర"రాగా ఫర్ రైస్ ఆఫ్ ఇండియా". కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే ఈ మహా సంకల్పం మన నగరంలో విశేష స్పందన పొందింది. కాటూరి వెంకటేశ్వర్లు సమాజ హితం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని మేయర్ అభినందించారు. ఆయనను శాలువాతో సత్కరించి, దేశ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయాణం దిగ్విజయంగా పూర్తి కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రసిడెంట్ సంజీవ్ ముదిరాజ్, మాజీ మునిసిపల్ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this article

Related Articles