download
తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి పార్థివదేహానికి జర్నలిస్టుల నివాళి
General

తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి పార్థివదేహానికి జర్నలిస్టుల నివాళి

Sunday, 6 September 202636 views

తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి పార్థివదేహానికి జర్నలిస్టుల నివాళి

నేటి కేసరి మహబూబ్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 06

తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవి పార్థివదేహానికి పలువురు జర్నలిస్టులు నివాళులర్పించారు. పల్లె రవి మృతదేహాన్ని సందర్శించిన జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, తొలివెలుగు మధు, రామ్ కొండ సుదీప్, ఏబీఎన్ రవి, నరేంద్రచారి, ఏబీఎన్ బసవరాజ్ శేఖర్ గౌడ్ తదితరులు పల్లె రవి పార్థివదేహానికి నివాళులర్పించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె రవి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. ఆయన మృతి ఉద్యమ కుటుంబానికి, సన్నిహితులకు తీరని లోటని పేర్కొన్నారు. పల్లె రవి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Share this article

Related Articles