download
సిద్దిపేటలో విషాదం..
General

సిద్దిపేటలో విషాదం..

Sunday, 6 September 20263 views

సిద్దిపేటలో విషాదం..

ఆస్పత్రి భవనంలో ల్యాబ్ టెక్నిషియన్ ఆత్మహత్య

నేటి కేసరి సిద్ధిపేట సెప్టెంబర్ 06

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు మరియు పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన ఆకుపత్తి పవన్ (అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి) సిద్దిపేటలోని గవర్నమెంట్ హాస్పటల్ లో మూడో అంతస్తులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పవన్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share this article

Related Articles