download
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
General

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం

Sunday, 6 September 20263 views

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం

ఆర్టీసీ మహిళా కండక్టర్ సరిత

నేటి కేసరి మహబూబ్నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 06

మానవత్వం, నిజాయితీ ఇంకా బ్రతికే ఉన్నాయని చాటిచెప్పే ఒక అద్భుతమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ గారు తన భార్యతో కలిసి హజ్ యాత్ర నిమిత్తం హైదరాబాద్‌కు ఆర్టిసి బస్సులో ప్రయాణించారు. అఫ్జల్‌గంజ్‌లో దిగి నాంపల్లికి వెళ్లే హడావిడిలో, వారు తమ వెంట తెచ్చుకున్న రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయారు.ఆ నగదు బ్యాగును గమనించిన షాద్‌నగర్ డిపో మహిళా కండక్టర్ సరిత, వెంటనే డ్రైవర్ నర్సింహులుకి సమాచారం అందించి బ్యాగును భద్రపరిచారు. కాసేపటికి నగదు పోయిందని లబోదిబోమంటూ తీవ్ర ఆందోళనతో తిరిగి వచ్చిన ఆ దంపతులకు, పైసా తగ్గకుండా రూ. 3 లక్షల నగదు బ్యాగును క్షేమంగా అప్పగించారు.కండక్టర్ సరిత నిస్వార్థ సేవ, నిజాయితీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు.సాధారణ మధ్యతరగతి ఉద్యోగంలో ఉంటూ కూడా, ఎదురుగా లక్షల రూపాయలు కనిపించినా ఎలాంటి ఆశ లేకుండా ప్రయాణికులకు అందించిన కండక్టర్ సరితకి, డ్రైవర్ నర్సింహులుకి హృదయపూర్వక అభినందనలు.

Share this article

Related Articles