download
 దేవతామూర్తుల ఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్
General

దేవతామూర్తుల ఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్

Sunday, 30 August 20263 views

మహబూబ్‌నగర్ నగరం

దేవతామూర్తుల ఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

నేటి కేసరి మహబూబ్నగర్ ప్రతినిధి ఆగస్టు 29

మహబూబ్‌నగర్ నగరంలోని శ్రీరామ కాలనీ, ఏనుగొండలో పునఃప్రతిష్ఠ నిర్వహిస్తున్న ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాశీ విశాలాక్షి సమేత శ్రీ పరమశివుడు, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి దేవతామూర్తుల ఊరేగింపు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో సర్వదేవతా నిలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ దివ్య మందిరం భక్తుల కోరికలను తీర్చాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, కార్పొరేటర్ పెద్ద గొల్ల నర్సింహులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles