download
​మొగుడంపల్లిలో పోలీసుల మెరుపు దాడి!
General

​మొగుడంపల్లిలో పోలీసుల మెరుపు దాడి!

Thursday, 27 August 20264 views

​మొగుడంపల్లిలో పోలీసుల మెరుపు దాడి! ​• పేకాట స్థావరంపై రైడ్.. నలుగురు రాయుళ్ల అరెస్ట్. • రూ. 86 వేల నగదు, ఫోన్లు, బైక్‌లు సీజ్. • చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు. • అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ​నేటికేసరి జహీరాబాద్ ఆగస్టు 27: ​సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని మొగుడంపల్లి గ్రామ శివారులో గురువారం పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. గ్రామంలో కొందరు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు, చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఈ మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​పట్టుబడిన నిందితుల వద్ద నుంచి రూ. 86,840 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ​ఈ సందర్భంగా చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ... "గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. చట్టవిరుద్ధంగా పేకాట, ఇతర జూదాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తప్పవు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని హెచ్చరించారు.

Share this article

Related Articles