
గుప్తనిధుల తవ్వకాల కలకలం వజ్రాలంటూ ఫోటోలు వైరల్
గుప్తనిధుల తవ్వకాల కలకలం వజ్రాలంటూ ఫోటోలు వైరల్
నేటి కేసరి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆగష్టు 23
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిళ్ల గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం, తవ్వకాల్లో వజ్రాలు లభించాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.వజ్రాలను పలువురికి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం వైరల్ అవుతున్నవి నిజమైన వజ్రాలేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులువజ్రాలు ఎవరి వద్ద ఉన్నాయి ఎవరు విక్రయిస్తున్నారు.అనే ప్రశ్నలువజ్రాల వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.నల్లమల అటవీ ప్రాంతంలోని పలు చోట్ల గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుప్తనిధుల పేరుతో అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెంచాల్సిన అవసరం అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు అటవీ, పోలీసు శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి. వజ్రాల వేట నిజమా అనే విషయాలను అధికారులు తేల్చాలి.
Share this article



