
ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలి:ధర్మరాజుల శంకర్
ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలి:ధర్మరాజుల శంకర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే
పినపాక నేటికేసరి ఆగష్టు 25
నువ్వు గిల్లు నేను ఏడుస్తా అనే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు పినపాక మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధర్మరాజుల శంకర్ . మంగళవారం నేటికేసరి పత్రికతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ నాయకుల తీరును ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి పినపాక నియోజకవర్గంలో ఒక రాజకీయ క్రీడ మొదలైందన్నారు.రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండాలి నువ్వు నెగ్గకపోతే నేను ,నేను నెగ్గకపోతే నువ్వు నెగ్గాలి అనే విధంగా పాత ,కొత్త నాయకుల తీరు ఉందని తెలిపారు. ఈ రెండు పార్టీల వల్ల 80 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ప్రజలకు ఏమి ఒరిగిందన్నారు.పేదవాడు ఇంకా పేదవాడు గాను, ధనికుడు ఇంకా ధనికుడుగాను ఎదుగుతున్నాడు తప్పితే మరేమిలేదని అన్నారు .ప్రత్యామ్నయం దిశగా ప్రజలు తప్పక ఆలోచించాలని కోరారు.అన్ని విధాలుగా ఆరితేరిన ఇరుపార్టీలను ఒక కంట కనిపెడుతూ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యామ్నాయ వ్యక్తులపై దృష్టి పెట్టాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ పార్టీల రాజకీయ క్రీడకు అట్రాక్షన్ కాకుండా ప్రజలు రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి తీర్పు కోసం కంకణ బద్ధులై ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలను కోరుతున్నట్లు ధర్మరాజుల శంకర్ తెలిపారు.
Share this article



