download
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
General

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Tuesday, 25 August 2026345 views

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నేటి కేసరి సిద్దిపేట ఆగస్టు 25

గజ్వెల్ : లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించిన సంఘటన గజ్వేల్ మండలంలోని కొల్గూర్ లో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన బాపని బంజరపల్లి చెందిన పర్సు ఐలయ్య తొగుట మండలం బండారుపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు ఈ క్రమంలో తన ద్విచక్ర వాహనం మీద బండారుపల్లి కి వస్తుండగా కోల్గూరు వద్ద లారీ వేగంగా ఢీ కొట్టి అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఉన్న గ్రామం ముంపు గురి కావడంతో బండారుపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న ఐలయ్య ఇలా ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబంలో తీరని విషయాలు నెలకొంది అతనికి భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు.

Share this article

Related Articles