download
మాజీ ముఖ్యమంత్రి వైయస్ చేపట్టిన ఉచిత  పథకాలు
General

మాజీ ముఖ్యమంత్రి వైయస్ చేపట్టిన ఉచిత పథకాలు

Wednesday, 2 September 202612 views

మాజీ ముఖ్యమంత్రి వైయస్ చేపట్టిన ఉచిత పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి : జగిత్యాల ఎమ్మెల్యే నేటి కేసరి జగిత్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 2 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కీ. శే వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత కరెంట్ విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు ప్రజల్లో చిరస్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచాయని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కీ.శే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో వారి చిత్రపటానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య పూల మాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో పల్లెలను పరిశీలించి రైతులతో మాట్లాడి అధికారం లోకి వచ్చాక రైతు పక్షపాతి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.సాగు నీటి అంశాల విషయంలో వైఎస్ ఆశయాలకు అనుగుణంగా స్థానిక జగిత్యాల నాయకులు పనిచేయలేక పోయారన్నారు.జగిత్యాలలో ఇందిరమ్మ కాలనీని మంజూరు చేసింది వైస్సార్ అని కొనియాడారు, దీనికి మౌలిక సదుపాయాలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత రెడ్డి ద్వారా పూర్తి చేస్తున్నాను అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల లో అర్బన్ హౌసింగ్ కాలనీ లో వైఎస్ 2008లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే అక్కడ కరెంట్ కనెక్షన్ తీసుకున్నది 2009 వరకు ఒకరు మాత్రమే 2014వరకు పదుల సంఖ్య లో మాత్రమే ఉండేవారని 2020వరకు 170మంది 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాలు కు 36కోట్లు మంజూరు తో ప్రజల్లో ఆశ చిగురించి దన్నారు. 2026 లో 3500మంది విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు అని ఇందిరమ్మ కాలనీ వాసులకు రేవంత్ సర్కార్ పూర్తి భరోసా కల్పిస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు.త్వరలో దాదాపు అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గిరి నాగభూషణం పిసిసి సెక్రెటరీ బండ శంకర్,ఏఎంసి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, పిసిసి సేవాదళ్ సెక్రెటరీ ముఖేష్ కన్నా,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త. మోహన్, ఎన్ ఎస్ యు ఐ i భార్గవ్,సేవాదళ్ పట్టణ అధ్యక్షులు ద్యావన్ పల్లి. రాజేందర్,డీసీసీ ఉపాధ్యక్షులు జెల్ల. రవి, రేపల్లె. హరి కృష్ణ,డీసీసీ కార్యదర్శి పులి. నర్సయ్య, కూసరి. అనిల్, లైశెట్టి. చంద్ర మౌళి, కోలా శ్రీనివాస్,బాల ముకుందం, రెడ్డి సంఘము జిల్లా అధ్యక్షులు కోప్పెర. వెంకట్ రెడ్డి, సురేష్, సతీష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు

Share this article

Related Articles