download
శ్రీరామ్ కాలనీలో యూజీడీ పనులకు శంకుస్థాపన
General

శ్రీరామ్ కాలనీలో యూజీడీ పనులకు శంకుస్థాపన

Wednesday, 2 September 20262 views

శ్రీరామ్ కాలనీలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

నేటి కేసరి మహబూబ్నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 02

మహబూబ్‌నగర్ నగరంలోని 2వ డివిజన్ ఏనుగొండలో ₹24.48 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. యూజీడీ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత,డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్,సిరాజ్ ఖాద్రీ, 2వ డివిజన్ కార్పొరేటర్ పెద్దగొల్ల నర్సింహులుతో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles