
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్ గా శ్రీమతి పడాల సౌజన్య లత
బ్రహ్మాండ్ సనాతన సంఘ్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్ గా శ్రీమతి పడాల సౌజన్య లత
నేటి కేసరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్02
బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర కార్యాలయం లో అధ్యక్షులు శివ చేతులమీదుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కో- కన్వీనర్ గా నియామక పత్రం శ్రీమతి పడాల సౌజన్య లత అందుకున్నారు.ఈ సందర్భంగా పడాల సౌజన్య లత మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని గౌరవిస్తూ మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి భక్తీ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి హిందూ మతం మరియు సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు నోములు,వ్రతాలు,హోమాలు,యజ్ఞయాగాదులు చేపడతానని తెలిపారు. అనంతరం అధ్యక్షులు శివ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కలిసి మెలిసి జీవించాలని ,హిందూ మతం,సనాతన ధర్మంలో జీవిత క్రమశిక్షణ తో పాటుగా ఎంతో గొప్పగా సంస్కృతి సంప్రదాయాలు అద్దం పడుతుందని మరియు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరిని బాగస్వామ్యులను చేయ్యాలని. మహిళలు, మరియు ,పిల్లలు,యువత ముందుకు రావాలని వారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
Share this article



