download
హుస్నాబాద్‌ను విద్యా హబ్‌గా మారుస్తాం
General

హుస్నాబాద్‌ను విద్యా హబ్‌గా మారుస్తాం

Monday, 31 August 202631 views

హుస్నాబాద్‌ను విద్యా హబ్‌గా మారుస్తాం

రూ.14.56 కోట్లతో హాస్టల్ భవనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

నేటి కేసరి ప్రతినిధి హుస్నాబాద్ 31

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సమగ్ర విద్యా హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉమ్మాపూర్ లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రూ.14.56 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాలుర, బాలికల నూతన హాస్టల్ భవనాలకు (ఒక్కో హాస్టల్‌కు రూ. 7.28 కోట్లు) మంత్రి మంగళవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు హుస్నాబాద్ పాఠశాల 75 ఏళ్ల వేడుకల సందర్భంగా ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని, ఆ వెంటనే ఇంజనీరింగ్ కాలేజీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రిని కోరగానే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. క్యాబినెట్ అప్రూవల్, స్థలం, నిధుల సేకరణ పూర్తి చేసి, పట్టుదలతో ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల భవనానికి, నేడు హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమం – మౌలిక సదుపాయాలు

మొదటి ఏడాది 60 మంది చేరితే ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు అందించామని, రాజకీయ జోక్యం లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండవ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 120కి చేరిందని, ఐటీ విభాగంలో ప్రవేశాలు 175కి పెరిగాయని చెప్పారు.విద్యార్థుల కోసం త్వరలోనే ఇంజనీరింగ్ కళాశాలకు రెండు కొత్త బస్సులు రాబోతున్నాయని, హాస్టల్ లోపలే అధునాతన లైబ్రరీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాబోధన, అకడమిక్ అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసే బాధ్యత వైస్ చాన్స్ లర్ దేనని స్పష్టం చేశారు.

నియోజకవర్గానికి రాబోతున్న ప్రాజెక్టులు

విద్యా సంస్థలు కోహెడ తంగళ్లపల్లి, సైదాపూర్‌లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భీమదేవరపల్లిలో నవోదయ స్కూల్, చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎల్కతుర్తి వద్ద బాసర ఐఐఐటీ (ట్రిపుల్ ఐటీ ) బ్రాంచ్ రాబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ ) కి శంకుస్థాపన పూర్తయింది. హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ, స్పోర్ట్స్ స్టేడియం, పారిశ్రామిక కారిడార్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ నిర్మిస్తున్నాం. ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్, గ్లాస్ బ్రిడ్జ్ పనులతో టూరిజం పెరిగిందన్నారు. రవాణా సౌకర్యాలు కళాశాలకు అప్రోచ్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, పందిళ్ల నుండి ఎల్లమ్మ చెరువు, మల్లెచెట్టు చౌరస్తా మీదుగా నూతన రహదారులను నిర్మిస్తున్నాం.నేను విద్యార్థి నాయకుడిని కాబట్టే ఇక్కడికి ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది. ప్రజాప్రతినిధిగానే కాకుండా మీ భవిష్యత్తుకు గార్డియన్గా ఉంటాను. ఏడాదిలోగా హాస్టల్ భవనాల నిర్మాణాలు పూర్తి చేసి, విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌తో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తాం అని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, ప్రిన్సిపల్, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share this article

Related Articles