download
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్
General

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్

Monday, 31 August 202611 views

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్

​• రంజోల్ TGSWREIS పాఠశాలలో పోలీసుల సైబర్ అవగాహన సదస్సు.

• పాల్గొన్న 300 మంది విద్యార్థులు.. సైబర్ మోసాలపై జాగ్రత్తలు.

• ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దు.

• ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే '1930'కి కాల్ చేయాలి.

​నేటికేసరి జహీరాబాద్ ఆగస్టు 31: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు కళ్ళెం వేసే దిశగా, విద్యార్థి దశ నుంచే సైబర్ భద్రతపై అప్రమత్తం చేసేందుకు పోలీసులు ముందడుగు వేశారు. సోమవారం మండల పరిధిలోని రంజోల్ గ్రామంలో గల TGSWREIS పాఠశాలలో చిరాగ్‌పల్లి ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో సుమారు 300 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని సైబర్ మోసాలపై అవగాహన పెంచుకున్నారు. ​గుర్తుతెలియని లింక్‌లు క్లిక్ చేయొద్దు.. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని, ఆన్‌లైన్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్లకు వచ్చే ఫేక్ లింకులు, సోషల్ మీడియా వేదికగా జరిగే మోసాలు, ఓటీపీ (OTP) ఫ్రాడ్స్ తదితర అంశాలను విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లతో పాటు బ్యాంక్ ఖాతాలు మరియు వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వినియోగించాలని, గుర్తు తెలియని ఫేక్ లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ​మోసపోతే 1930 కు కాల్ చేయండి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఎవరైనా అనుకోకుండా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఆన్‌లైన్ ఆర్థిక మోసానికి గురైతే.. ఏమాత్రం కంగారు పడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే '1930' టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిరాగ్‌పల్లి పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Share this article

Related Articles