
సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయునికి అరుదైన గౌరవం
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా చేగూరి దేవరాజ్ ఎంపిక
నేటి కేసరి సిద్ధిపేట సెప్టెంబర్ 04
ఉపాధ్యాయ వృత్తిలో నిస్వార్థ సేవలు అందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న సిద్దిపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయునికి రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. నాంచారుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్) లో ఎస్‌జీటీ గా విధులు నిర్వర్తిస్తున్న చేగూరి దేవరాజ్ రాష్ట్ర స్థాయి 'ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు'కు ఎంపికయ్యారు.బోధనలో నూతన పద్ధతులను అవలంబించడంతో పాటు,పాఠశాల అభివృద్ధిలో,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో ఆయన చూపుతున్న ప్రత్యేక చొరవకు ఈ గుర్తింపు లభించింది. విద్యా రంగంలో దేవరాజ్ చేస్తున్న విశేష కృషిని గుర్తించిన ప్రభుత్వం ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది.ఈ సందర్భంగా చేగూరి దేవరాజ్‌కు సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,తోటి ఉపాధ్యాయులు, నాంచారుపల్లి గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందడం జిల్లాలోని విద్యావర్గాలకు గర్వకారణమని వారు కొనియాడారు. ఈ పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తానని దేవరాజ్ ఈ సందర్భంగా తెలిపారు.
Share this article



