download
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
General

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..

Friday, 4 September 202691 views

లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు, తృటిలో ప్రాణాలతో బయటపడిన మెడికల్ విద్యార్థిని

నేటి కేసరి సిద్ధిపేట సెప్టెంబర్ 4

సిద్దిపేట పట్టణ శివారులోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ రూపంలో కబళించబోయిన మృత్యువు నుంచి ఆ యువతి తృటిలో ప్రాణాలతో బయటపడింది. అయితే ఈ ఘటనలో ఆమె కాలుపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట రూరల్ మండలం మిట్టపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థిని చదువుకుంటోంది.ఈ క్రమంలో మెడికల్ కాలేజీ వెళుతుండగా నిమిత్తం రంగధాంపల్లి చౌరస్తా వద్దకు రాగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక లారీ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా నలిగిపోయి దారుణమైన గాయాలయ్యాయి.ప్రమాతాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు. క్షతగాత్రురాలైన విద్యార్థినిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this article

Related Articles