download
అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి
General

అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి

Thursday, 3 September 202621 views

అవినీతి, అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండి

కేటీఆర్, హరీష్ రావు

మంత్రి అడ్లూరి సవాల్

వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కొప్పుల ఈశ్వర్ కి పంపిస్తా

ప్రోగ్రెస్ రిపోర్టులో తప్పులుంటే దేనికైనా సిద్ధం

నేటి కేసరి జగిత్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 3

వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2023 డిసెంబర్ లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. వెయ్యి రోజులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ యాస భాషతో ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీని ఏక వచనంతో సంబోధించడం కేటీఆర్ హరీష్ రావుల అహంకారానికి నిదర్శనమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లకే పరిమితమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులతో పాటు ధర్మపురి దేవుడికి సైతం శఠగోపం పెట్టారని మంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు వేములవాడ కొండగట్టు పుణ్యక్షేత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నరని మంత్రి గుర్తు చేశారు. మాజీ మంత్రి కొప్పులకు వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తాం అన్నారు 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి ప్రజలు తనకు పట్టం కట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధర్మపురి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏనాడు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గ వెయ్యి రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి పంపిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సాగౌడ్, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సుధాకర్, నాయకులు వేముల రాజుతో పాటు ధర్మపురి కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles