
General
ఫోన్ కాల్ ద్వారా వెంకటేశ్వర్ రెడ్డిని అభినందించిన కేటీఆర్
Friday, 4 September 202624 views
నేటి కేసరి మహబూబ్ నగర్ ప్రతినిధి సెప్టెంబర్ 04
భూత్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం. ఫోన్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర గులాబీ సైన్యాన్ని అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న దేవరకద్ర బీఆర్ఎస్ సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చి అందరిని కలుస్తానని చెప్పిన కెటిఆర్. రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
Share this article



