
బల్మూర్ మండలంలో బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
బల్మూర్ మండలంలో బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే అక్రమ అరెస్టులా..? ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ బీజేపీ శ్రేణులు!
నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్ 07
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టయిన ముఖ్యనాయకులు బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు, రమేష్, ఆంజనేయులు, సైదులు యాదవ్, స్వర్ణ, అజయ్, బీజేవైఎం మల్లేష్, వార్డ్ నెంబర్ చంద్రశేఖర్ ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బకాయిల నిధులు పూర్తిగా విడుదల చేసేంత వరకు బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగేది లేదని నాయకులు స్పష్టం చేశారు.
Share this article



