download
మహంకాళి అమ్మవారినీ దర్శించుకున్న రాష్ట్ర బీసీ కుల సంఘాల అధ్యక్షులు
General

మహంకాళి అమ్మవారినీ దర్శించుకున్న రాష్ట్ర బీసీ కుల సంఘాల అధ్యక్షులు

Monday, 24 August 20264 views

జవహర్ నగర్ మహంకాళి అమ్మవారినీ దర్శించుకున్న రాష్ట్ర బీసీ కుల సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ బీసీ జేఏసీ చైర్మన్ కుందరపు గణేష్ చారి

జవహర్ నగర్ నేటి కేసరి ఆగస్టు 23

నగర పాలక సంస్థ కీసర సర్కిల్ పరిధిలో జవహర్ నగర్ డివిజన్లో ఆదివారం రోజున అంగరంగ వైభవంగా బోనాల పండుగను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీల దళపతి బీసీల యుద్ధనౌక జాజుల శ్రీనివాస్ గౌడ్, హాజరై మాట్లాడుతూ అమ్మవారిని బీసీల రాజ్యాధికారం రావాలని బీసీలందరూ ఉన్నత చదువులు చదవాలని, బీసీలు ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకున్నట్లు తెలియజేశారు.అతిథిగా హాజరైన బీసీల కోసం పోరాడుతున్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ చారి మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారని వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఏ ఒక్క సీటును కూడా అగ్రకులాలకు గెలవనియోద్దని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజు గౌడ్, మాజీ కార్పొరేటర్ రాజు, జవహర్ నగర్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మారోజు సోమాచారి, కోశాధికారి రేగోటి సురేష్, కార్యదర్శి శనిగా రం నరసింహ, బిసి ఐక్యవేదిక కార్యదర్శి రామ్బ్రహ్మం , బీసీ సీనియర్ నాయకులు గుంటుజు లింగాచారి, బీతోజురామాచారి బి జె ఆర్ నగర్ విశ్వకర్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి గాలయ చారి, విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి వడ్ల యాదగిరి, బీసీ ఉపాధ్యక్షులు రాజు యాదవ్, బీసీ ఐక్యవేదిక కార్యదర్శి అశోక్ యాదవ్, ఏ రాజు యాదవ్, విశ్వకర్మ సంక్షేమ సంఘం కోశాధికారి రామచంద్ర చారి, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, విశ్వబ్రాహ్మణ హక్కుల సాదాన సమితి ఉపాధ్యక్షులు సత్యం చారి, ప్రచార కార్యదర్శి గొల్లపల్లి వెంకటేష్ చారి పాల్గొన్నారు.

Share this article

Related Articles