download
ఉమామహేశ్వర డిజైన్ మార్చాలి
General

ఉమామహేశ్వర డిజైన్ మార్చాలి

Monday, 24 August 202627 views

ఉమామహేశ్వర డిజైన్ మార్చాలి

బలవంతపు భూసేకరణ ఆపాలి సి పి ఎం

భూ సదస్సును భగ్నం చేస్తున్న పోలీసులు

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించండి సిపిఎం 

అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి ఆగస్టు 24

నాగర్ కర్నూల్ జిల్లా  బల్మూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర రిజర్వాయర్లు భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులచే అవగాహన కల్పించడం కోసం భూ సదస్సు ఈరోజు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు సిపిఎం పార్టీ జిల్లా నాయకులను మండల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్  తీవ్రంగా వ్యతిరేకించారు  సిపిఎం పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని బలవంతపు భూసేకరణ ఆపాలని రిజర్వాయర్ తెగిన చెరువు లేదా రామగిరి భూముల వద్ద నిర్మాణం చేయాలని రైతుల యొక్క అభిప్రాయాలను కూడా ప్రభుత్వము పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పోరాటాలను నిర్బంధంతో ఆపాలనే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వారు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ  గెలవకముందు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడడం దుర్మార్గమని ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రైతుల గోడూను వినే విధంగా వారితో గ్రామ సదస్సులు నిర్వహించి వారి అభిప్రాయాలను గౌరవించాలని కోరారు.

Share this article

Related Articles