download
జిల్లా కేంద్రంలో వరుస పెట్టి చలాన్ల మోత
General

జిల్లా కేంద్రంలో వరుస పెట్టి చలాన్ల మోత

Monday, 24 August 20264 views

జిల్లా కేంద్రంలో వరుస పెట్టి చలాన్ల మోత

నేటి కేసరి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆగష్టు 24

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులనుండి ట్రాఫిక్ పోలీసులు వరుస పెట్టి అన్ని వాహనాలకు చలాన్లు విదిస్తున్నారు. వాహన దారులు నిబంధనలు పాటించకుంటే పోలీసులు ఫోటోలు కొట్టి చలాన్లు వేయాలి. జిల్లా కేంద్రంలో ఒక్కటే ప్రధాన రహదారి ఈ దారిలో షాప్ లు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులు కలవు. వీటిలో పనుల నిమిత్తం ప్రజలు వాహనాలు వేసుకొని వెళ్లి పనులు చూసుకుంటారు. ప్రధాన రహదారి పక్కన ఆపుతున్న వాహనాలను ఫోటోలు కొట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. దారిపై వాహనాలను ఆపితే తప్పు కాని దారి కిరువైపులా ప్రక్కన ఆపితే జరిమానాలు తప్పడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దారి కూడా విశాలంగా లేదు కనుక సామాన్య ప్రజలపై ఇలాంటి ఆర్ధిక భారం మోపవద్దని ప్రజలు కోరుతున్నారు

Share this article

Related Articles