download
తనిఖీకి వచ్చి, సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్!
General

తనిఖీకి వచ్చి, సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్!

Monday, 24 August 202648 views

తనిఖీకి వచ్చి, సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్!

బల్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సోషల్ టీచర్‌’గా మారిన హేమంత కేశవ్ పాటీల్

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి ఆగస్టు 24

 పాఠశాల తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కాసేపు ‘సోషల్ టీచర్‌’గా మారి విద్యార్థులకు పాఠం బోధించారు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ 8వ తరగతి గదిలోకి వెళ్లి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై వారిని ప్రశ్నిస్తూ, స్వయంగా బోర్డుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్యరేఖను వివరిస్తూ పాఠం చెప్పారు. పాఠశాలకు ఆకస్మికంగా చేరుకున్న జిల్లా కలెక్టర్ ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు పరిస్థితి, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం రోజువారిగా అందించాలని సూచించారు. అనంతరం 8వ తరగతి తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా సంభాషించారు. సాంఘిక శాస్త్రం పాఠ్యాంశానికి సంబంధించిన భూమధ్యరేఖ  భారతదేశంలో ఎడారులు ఏర్పడేందుకు కారణాలపై పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలను ఆసక్తిగా విన్న కలెక్టర్, పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారో స్వయంగా పరిశీలించారు. అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏమిటి? భూమధ్యరేఖ ప్రాధాన్యత ఏమ�

Share this article

Related Articles