download
బల్మూర్‌లో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
General

బల్మూర్‌లో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన

Monday, 24 August 2026215 views

బల్మూర్‌లో రూ.146.71 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన

  మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి ఆగస్టు 24

 నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రహదారి పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట  ఫేజ్-1లో ఈ పనులను చేపట్టనున్నారు. మూడు రహదారి పనులు ఇవీ రూ. రూ.32.99 కోట్లతో అమ్రాబాద్–ఇప్పలపల్లి రహదారి: పదర, వాంకేశ్వరం, చిట్లముకుంట, ఉడిమిల్ల, ఇప్పలపల్లి గ్రామాల మీదుగా కిలోమీటర్ 0/000 నుంచి 34/200 వరకు రహదారిని బలోపేతం చేయనున్నారు.  రూ.35.71 కోట్లతో బల్మూర్–నాగర్‌కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారి: బల్మూర్, గోడల్, తుమ్మన్‌పేట గ్రామాల మీదుగా రహదారిని రెండు లేన్లుగా విస్తరించనున్నారు. రూ.78.01 కోట్లతో అచ్చంపేట–రాకొండ (ఉప్పునుంతల మీదుగా) రహదారి: ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ గ్రామాల మీదుగా రెండు లేన్లుగా విస్తరించనున్నారు.

Share this article

Related Articles