
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడికి నిరస
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ దాడికి నిరసనగా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్ 01
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై నిన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ యువమోర్చా (BJYM) అచ్చంపేట శాఖ ఆధ్వర్యంలో నేడు అచ్చంపేట పట్టణ కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు మంగ్య నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడి పిరికిపంద చర్య అని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం, ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని, దాడులకు భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులను కొనసాగిస్తే తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని, తెలంగాణలో బీజేపీ శక్తి ఏమిటో కాంగ్రెస్ నాయకత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.
అనంతరం బీజేపీ, బి జె వై ఎం నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కార్యక్రమం అనంతరం పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్
Share this article



