download
 బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం..
General

బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం..

Tuesday, 1 September 20262 views

కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలనపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం.. మూడవత్ శ్రీనివాస్ నాయక్

నేటికేసరి అచ్చంపేట ప్రతినిధి సెప్టెంబర్  01

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 1000 రోజుల ప్రజా పాలనపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువత, రైతులు, మహిళలు, పేదలు, సామాన్య ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, కొత్త పెన్షన్లు, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నాయని శ్రీనివాస్ నాయక్ విమర్శించారు. కేటీఆర్ … కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన పనులను ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రజలకు వాస్తవాలు తెలుసు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి అందించిన నిధులు, చేసిన అభివృద్ధిపై కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బలమని శ్రీనివాస్ నాయక్ అన్నారు. అబద్ధపు ప్రచారాలను తెలంగాణ ప్రజల�

Share this article

Related Articles